Sunday, May 5, 2024
- Advertisement -

RRR సినిమా ముహూర్తం.. 11.11.11..అభిమానుల‌కు పండుగే

- Advertisement -

ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాసివ్ మల్టిస్టారర్ RRR సినిమా ప్రారంభ వేడుక తేదీని ఖరారు చేశారు. రాజ‌మౌళి. 11.11.11 అంటూ మ్యాజిక‌ల్ డేట్ ఎంచుకున్నాడు. 11వ నెల‌.. 11వ తేదీ.. ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ చిత్రానికి ముహూర్తం పిక్స్ అయ్యింది.

ఈ సినిమా ఇప్పట్లో ప్రారంభం కాదంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్ పెడుతూ RRR లాంచ్ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. రాజ‌మౌళి కూడా ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ కావ‌డంతో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు జ‌క్క‌న్న‌.

100 కోట్ల‌తో ఓ సినిమా చేస్తున్నారంటేనే ద‌ర్శ‌కుడికి నిద్ర ప‌ట్ట‌దు. అలాంటిది 300 కోట్ల బ‌డ్జెట్ అంటే ఆయ‌న‌కు ఎలా ఉంటుందో ఒక్క‌సారి ఊహించుకోండి..? ఇప్పుడు రాజ‌మౌళి కూడా ఇదే ప‌రిస్థితుల్లో ఉన్నాడు. దీని కోసం జ‌క్క‌న్న చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు.

సినిమా ఏ మాత్రం తేడా జ‌రిగినా కూడా అభిమానుల నుంచి రెస్పాన్స్ మామూలుగా ఉండ‌దు. రాజ‌మౌళి అయినా ఎవ‌రైనా ఏ ఒక్క హీరోను త‌క్కువ‌గా చూపించినా ఫ్యాన్స్‌తో అస‌లు ర‌చ్చ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా వ‌ర్క్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ పాల్గొంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -