Sunday, May 5, 2024
- Advertisement -

మ‌ళ్లీ మోదీనే ప్ర‌ధాని….ఆన్‌లైన్ స‌ర్వేలో సంచ‌ల‌న ఫ‌లితాలు

- Advertisement -

దేశంలో 2019 ఎన్నిక‌లు సాదా సీదాగా జ‌రిగేట‌ట్లు క‌న‌బ‌డ‌టంలేదు. ఎన్డీఏను ఎదుర్కొనే దానికి కాంగ్రెస్ తో స‌హా ఇత‌ర పార్టీలు కూట‌ములుగా ఏర్ప‌డ‌డాటినికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. మోదీకీ చెక్ పెట్టేందుంకు కాంగ్రెస్ పావులు క‌దుపుతోంది. వ‌చ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదు మోదీకీ. ఇప్ప‌టికే స‌ర్వేలు కూడా భాజాపాకు పూర్తి మెజారిటీ రాద‌ని చెప్తున్నా ..మ‌రో సారి ఇత‌ర పార్టీల స‌హాక‌రంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నా ర‌ని స‌ర్వే తెలిపింది.

ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీ రాఫెల్ కుంభ‌కోనంపై ప్ర‌దాని మోదీనీ ఇరుకున పెడుతోంది. రాహుల్ గాంధీ ప్ర‌ధానికి నిద్ర‌లేకుండా చేస్తున్నారు. కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్లు రాహుల్ కు రాఫెల్ ఇష్యూ దొరికింది.మోదీనీ రాహుల్ ఎంత విమ‌ర్శించినా మ‌రో సారి ప్ర‌ధాని అవుతార‌ని ఓ ఆన్‌లైన్ స‌ర్వే తేల్చి చెప్పింది.

సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది ప్రధాని మోదీ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పట్ల కేవలం 17 శాతం మంది మాత్రమే విశ్వాసం చూపారు. తర్వాతి స్థానాల్లో అరవింద్ కేజ్రీవాల్ (8శాతం), అఖిలేశ్ యాదవ్ (3శాతం), మాయావతి (2శాతం) ఉన్నారు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపడతారని సర్వేలో పాల్గొన్న 50శాతం నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దేశం నుంచి అవినీతిని తరిమేయాలంటే మోదీనే మళ్లీ ప్రధాని అవ్వాలని ఆకాంక్షించారు.

ఇక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల విషయానికొస్తే.. మోదీ పాలనపై రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తెలుగు ప్ర‌జ‌లు మాత్రం వ్య‌తిరేక‌త‌ను చూపుతున్నారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -