Saturday, May 3, 2025
- Advertisement -

పుష్ప 2 @ రూ.829 కోట్లు

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇక తొలిరోజు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఏకంగా రూ. 294 కోట్లు రాబట్టగా నాలుగు రోజుల్లో అదిరే కలెక్షన్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది పుష్ప 2.

నార్త్ నుంచి సౌత్ దాకా ప్రతిచోటా పుష్ప 2 సునామీ కొనసాగుతోంది. బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ల వల్ల కాని మైలురాళ్లను పుష్ప 2 తిరగరాస్తోంది.

విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో వెయ్యి కోట్లకు పైగా రాబట్టిన పుష్ప 2…ఖచ్చితంగా రూ. 2 వేల కోట్ల మార్క్‌ను అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -