వైసీపీ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ముగ్గురు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరి రాజీనామాతో ఖాళీ అయిన మూడు స్థానాలకు ఇటీవలె నోటిఫికేషన్ వెలువడగా రెండు టీడీపీ ఖాతాలోకి ఒకటి మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించారు సీఎం చంద్రబాబు.
ఇక ఇవాళ బీజేపీ ఏపీతో పాటు మరో రెండు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు బీజేపీ అదిష్టానం అవకాశం కల్పించింది. మరో రెండు స్థానాలైన హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది.
టీడీపీ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు టీడీ జనార్ధన్, కంభంపాటి రామ్మోహన్, భాష్యం రామకృష్ణ, వర్ల రామయ్య, గల్లా జయదేవ్ పేరు వినిపించగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్ పేర్లను చంద్రబాబు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుంది.
