‘ఆర్ఎక్స్ 100’ సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోనే బోల్డ్ పాత్రలో నటించిన ఈమె బ్లాక్ బస్టర్ అందుకుంది కానీ ఆ తరువాత ఈమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఈ మధ్యనే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించిన ఈమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సీత’ సినిమాలో ఐటం నంబర్ లో కనిపించింది. అయితే సినిమాల గురించి పక్కన పెడితే పాయల్ రాజ్ పుత్ ఈ మధ్యనే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మధ్యనే పాయల్ రాజ్ పుత్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక షాకింగ్ ఫోటో ని పోస్ట్ చేసింది.
ఆ ఫోటో లో ఆమె పొగ తాగుతూ కనిపించింది. చేతిలో ఒకటి కాదు ఏకంగా రెండు సిగరెట్లను పట్టుకొని పొగ ఊదుతూ ఫోటోకి ఫోజు ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. “ఇంకా కబీర్ సింగ్/అర్జున్ రెడ్డి మోడ్ లోనే ఉన్నాను. నేను జస్ట్ నా తదుపరి సినిమాలో పాత్ర కోసం ఇలా చేస్తున్నాను. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం” అంటూ క్యాప్షన్ పెట్టి ఆ ఫోటో ని పోస్ట్ చేసింది పాయల్ రాజ్ పుత్. కానీ ఆ సినిమా ఏంటి అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పాయల్ రాజ్ పుత్ ‘డిస్కో రాజా’, మరియు ‘వెంకీ మామ’ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తుంది.
