Friday, May 3, 2024
- Advertisement -

కొత్త కోచ్ ఎంపికపై కోహ్లీ వ్యాఖ్యలకు షాక్ ఇచ్చిన సీఏసీ సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌

- Advertisement -

టీమిండియా కొచ్చ కోచ్ ఎవరనేది ఇప్పుడు బీసీసీఐలో ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచకప్ తో కోచ్, ఇతర సహాక సిబ్బంది పదవీ కాలం ముగిసింది. విండీస్ టూర్ ఉన్న నేపథ్యంలో 45 రోజుల పాటు పదవీ కాలాన్ని పొడిగించింది. కోచ్, ఇతర సహాయ సిబ్బంది నియామకానికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్మానించిన సంగతి తెలిసిందే.

ఇదలా ఉంటె వండీస్ టూర్ కు బయలు దేరే ముందు ప్రెస్ మీట్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కోచ్ ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశారు. కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఇప్పటికైతే నన్ను సంప్రదించలేదు. కొత్త కోచ్ ఎంపికపై వాళ్లు నా అభిప్రాయం అడిగితే.. తప్పకుండా చెబుతా. రవిశాస్త్రిని కోచ్‌గా కొనసాగిస్తే మేమంతా (టీమిండియా ఆటగాళ్లు) చాలా సంతోషిస్తాం.

ఇదలా ఉంటె కోహ్లీ వ్యాఖ్యలను క్రికెట్‌ సలహా కమిటీ(సీఏసీ) సభ్యుడు అన్షుమన్‌ గైక్వాడ్‌ స్పందించారు. ఆ వ్యాఖ్యలు కోహ్లీ వ్యక్తిగతం అన్నారు. గతంలో రవిశాస్త్రిని కోచ్‌గా నియమించే సమయంలో కెప్టెన్ కోహ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం కెప్టెన్ ఇష్టంతో తమకు పనిలేదని కమిటీ తేల్చి చెప్పింది.

ఎంపిక ప్రక్రియ అనేది బీసీసీఐపైనే ఆధారపడి ఉంటుంది. వారిచ్చే గైడ్‌లైన్స్‌ మేరకే మా ఎంపిక ఉంటుంది. కోహ్లి అతినికేం కావాలో చెప్పాడు. మహిళా జట్టు కోచ్‌ ఎంపిక చేసినప్పుడు మేం ఎవ్వరిని సంప్రదించలేదు. మా విధానంలోనే ఎంపికచేశాం అంటూ బదులిచ్చాడు. కోహ్లీ వ్యాఖ్యలను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోవచ్చ కాని మేము తీసుకోమని తెలిపారు.

దేశ, విదేశాల నుంచి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓపెన్ మైండ్ తోనె ఇంటర్యూలు నిర్వహిస్తామన్నారు గైక్వాడ్. విరాట్ కోహ్లి మాటలు కమిటీని ప్రభావితం చేయవని ఆయన చెప్పారు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ప్లానింగ్, ఆటగాళ్లతో వ్యవహరించే తీరు, సాంకేతిక నైపుణ్యాలను సీఏసీ అంచనా వేస్తుందని గైక్వాడ్ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -