పాయల్ రాజ్‌పుత్ తెలుగులో చేసింది ఒక్కే ఒక్క సినిమా అయినప్పటికి స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఆమె ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా విజయంలో పాయల్‌దే ఎక్కువ పాత్ర ఉందని చెప్పాలి. సినిమాలో పాయల్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది పాయల్. తన అందాల ఆరోబోతతో జనాలను థియటర్లకు రప్పిచింది. ఇక థియోటర్లకు వచ్చిన వారిని తన నటనతో కూడా కట్టిపడేసింది ఈ భామ. ఈ సినిమా తరువాత పాయల్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
వాటిలో తన కెరీర్‌కు ఉపయోగపడే సినిమాలు మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం మాస్ రాజా రవితేజతో ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ భామ ఓ ఐటం సాంగ్‌లో కనిపించనుందని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో బెల్లకొండ ,కాజల్ హీరో,హీరోయిన్లుగా సీత అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ ఓ ఐటం సాంగ్‌లో నటించనుందని సమాచారం.తేజ అడగ్గానే ఆమె కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి అంగీకరించిందట. ఇందుకుగాను ఆమెకు భారీ పారితోషికమే ముట్టిందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా ఈ తరుణంలో పాయల్ ఇలా ఐటం సాంగ్ చేస్తుందేటని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ