Tuesday, May 21, 2024
- Advertisement -

5 నిమిషాలకు 5 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన ‘RX 100’ హీరోయిన్‌

- Advertisement -

క్రేజ్ ఉన్న‌ప్పుడే ఓ రూపాయి వెన‌కేసుకోవాలి అనేది పాత కాలం నుండి చెబుతున్న‌ మాటే.అదే ఫార్మూలా ఫాలో అవుతుంది ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.ఎటువంటి అంచనాలు లేకుండా వ‌చ్చిన ఈ సినిమా టాక్ ఆప్ ది ఇండ‌స్ట్రీగా మారిన సంగ‌తి తెలిసిందే.2 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా 10 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.ఇంత‌లా ఈ సినిమా హిట్ అవ్వ‌డానికి కార‌ణం హీరోయిన్‌ పాయల్ రాజ్ పుత్.సినిమా ట్రైల‌ర్‌లోనే త‌న అందాల ప‌వ‌ర్ ఏంటో రుచి చూపించింది.దీంతో యూత్ సినిమాను చూడ‌టానికి ఆస‌క్తి క‌న‌బ‌రిచారు.సినిమాకు వ‌చ్చిన వాళ్ల‌ను త‌న న‌ట‌న‌తో ఫిదా చేసింది.

దీంతో పాయల్ రాజ్ పుత్ పేరు మారు మోగిపోయింది. ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది పాయల్ రాజ్ పుత్.దీంతో ఆమెకు వ‌ర‌స సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చి ప‌డుతున్నాయి.గ్లామర్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోలేని పాయల్ ను తమ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపిక చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఆమె ఓ సినిమా కూడా సైన్ చేసిందని సమాచారం. ఇక తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్ లో 5 నిమిషాలు స్టేజ్ పై కనిపించడానికి అమ్మడు ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా..? అక్షరాలా రూ.5 లక్షలు. ఇది తను ‘RX100’ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ తో సమానం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -