Friday, May 17, 2024
- Advertisement -

‘శ్రీనివాస కళ్యాణం’ ప్రీమియ‌ర్ షో టాక్‌

- Advertisement -

నితిన్‌,రాశి ఖ‌న్నా హీరో,హీరోయిన్లుగా తెర‌కెక్కిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం. ఈ సినిమా మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ లోపు ఇండ‌స్ట్రీలోని కొంద‌రి ప్ర‌ముఖుల కోసం ప్రీమియ‌ర్ షో ఏర్పాటు చేశారు.ఈ స్పెషల్ షో చూసిన వారు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారట.ఫ్యామిలీ డ్రామాతో కూడిన ఈ సినిమా చక్కటి ఎమోషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటుందని, సంగీతం సినిమా స్థాయిని పెంచిందని అంటున్నారు.

‘లై’, ‘ఛల్ మోహనరంగ’ సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో హిట్ కొడ‌తాడ‌ని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారట.సినిమాలో రాశి ఖ‌న్నాను చాలా అందంగా చూపించార‌ని తెలుస్తుంది.’శతమానంభవతి’ సినిమాను డైరెక్ట్ చేసిన సతీష్ వేగ్నేశ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. అయితే ఆ సినిమా ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయని అంటున్నారు. అయినప్పటికీ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ కథ అద్భుతంగా తెరకెక్కించారని చెబుతున్నారు. సినిమా నిడివి కూడా ఎక్కువుగా ఉంద‌ని స‌మాచారం.మ‌రో రెండు రోజుల్లో థియోటర్ల‌లో సంద‌డి చేయ‌నున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -