Wednesday, May 8, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ హీరోపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

- Advertisement -

ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో కార్తికేయ.అంత‌కుముందు రెండు మూడు సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికి స‌రైన స‌క్సెస్ రాలేదు.ఆర్ఎక్స్ 100 హిట్‌లో జోష్‌లో ఉన్నాడు కార్తికేయ‌.ఈ సినిమా త‌రువాత మ‌నోడికి వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.ప్రస్తుతం ఈ హీరో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. పలు ఆఫర్లు ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే కార్తికేయ‌పై కొన్ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి.

‘RX100’ కంటే ముందు కార్తికేయ సుఫారి అనే సినిమాలోనే నటించారని ఇప్పుడు ఆయనకు స్టార్ డమ్ రాగానే మమ్మల్ని పట్టించుకోవడం లేదని నిర్మాత వేణు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోల‌ను కూడా విడుదల చేశారు చిత్ర నిర్మాత‌.ఈ విషయంపై స్పందించిన హీరో కార్తికేయ.. ”ఆ వీడియో నాపై చిత్రీకరించిందే.. కానీ ఆ సినిమాలో మాత్రం నేను నటించలేదు.నేను ఈ సినిమాలో నటించలేదు” అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కార్తికేయ‌.మ‌రి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -