Thursday, May 2, 2024
- Advertisement -

ఇక్క‌డ హిట్ …అక్క‌డ తుస్‌

- Advertisement -

ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్క‌డ చూసిన ఆర్ఎక్స్ 100 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్‌గా నిలిచింది.కొత్త న‌టీన‌టుల‌తో తీసిన‌ ఈ సినిమాకు అజ‌య్ భూప‌తి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఆర్ఎక్స్ 100 ను తెర‌కెక్కించాడు.రెండున్న‌ర కోట్ల‌తో తీసిన ఈసినిమా 10 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం విశేషం.వీకెండ్ తర్వాత కూడా అదిరిపోయే వసూళ్లతో సాగిపోతోందీ చిత్రం. ఐతే అమెరికాలో మాత్రం ఈ చిత్రం ఆశించిన వసూళ్లు రాబట్టలేదు.

అలాగని దీనికి అక్కడ ప్రి రిలీజ్ బజ్ లేదని అనుకోవడానికి లేదు. తెలుగు రాష్ట్రాల్లో మాదిరే మంచి హైప్ రావడంతో దాదాపు వంద లొకేషన్లలో దీన్ని రిలీజ్ చేశారక్కడ. పెద్ద ఎత్తున ప్రిమియర్లు కూడా వేశారు.ఇప్పటిదాకా అక్కడ ఈ చిత్రం లక్ష డాలర్ల దాకా వసూళ్లు రాబట్టింది. నిజానికి ఈ సినిమా ఇలా ఆడుతుండటానికి ఇందులోని బోల్డ్ కంటెంట్ ప్రధాన కారణం అన్నది స్పష్టం. తెలుగు రాష్ట్రాల్లోని యూత్ ఎగబడి ఈ సినిమా చూస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -