Monday, April 29, 2024
- Advertisement -

మొదటిరోజు సాహో కలెక్షన్స్

- Advertisement -

సాహో.. అందరి చూపంతా ఈ సినిమా మీదే. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంది సాహో. డివైడ్ టాక్ వచ్చినా కూడా మొదటిరోజు వసూళ్ళలో మాత్రం సాహో ఏం నిరాశపరచలేదు ప్రభాస్ అభిమానులను. ఒక లెవెల్లో ఉన్నాయి సాహో కలెక్షన్స్. రివ్యూలు, పబ్లిక్ నెగిటివ్ రెస్పాన్స్ సాహోని ఏం చెయ్యలేకపొయ్యాయి. ఫైట్స్ కి, విజువల్ ఎఫెక్ట్స్ కీ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ‘సాహో’ తొలిరోజు రూ.35.2 కోట్ల షేర్ వసూలు చేసినట్టు తెలిసింది. ముంబై బాక్సాఫీస్ వద్ద కూడా రూ.24 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. తమిళ వెర్షన్‌లో రూ.11 కోట్లు రాబట్టినట్లు సమాచారం.

కలెక్షన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి:

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ‘సాహో’ వసూళ్ల వివరాలు
నైజాం – రూ. 9.4 కోట్లు
సీడెడ్ – రూ. 4.6 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.8 కోట్లు
తూర్పుగోదావరి – రూ. 4.4 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 3.6 కోట్లు
కృష్ణా – రూ. 2.5 కోట్లు
గుంటూరు – రూ. 4.7 కోట్లు
నెల్లూరు – రూ. 2.2 కోట్లు
మొత్తం షేర్ – రూ.35.2 కోట్లు

ముంబయి, గుజరాత్, మరాట్వాడా ప్రాంతాల్లో ‘సాహో’కు మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో రెండు వేల ప్రింట్స్ ఆలస్యంగా వచ్చాయి. బాహుబలి తర్వాత హిందీలో బెస్ట్ డబ్డ్ వెర్షన్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు మంచి విజువల్ ట్రీట్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -