Tuesday, April 30, 2024
- Advertisement -

నిన్నటివరకు యుద్దం…..ఇప్పుడు మాట మార్చిన పాక్

- Advertisement -

జమ్మూ,కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ తో యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ నుంచి మంత్రులందరూ ప్రగల్భాలు పలికారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా చైనా తప్ప ఎవరూ మద్దతు తెలుపకపోవడంతో ఇప్పుడు మాట మార్చింది పాక్.

నిన్నటి వరకు యుద్ధం అన్న పాక్ తాజాగా శాంతి వచనాలు వల్లించింది.భారత్ తో షరతులతో కూడిన ద్వైపాక్షిక చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి చెబుతున్నారు.భారత్ తో చర్చల విషయంలో పాకిస్థాన్ చింతించడంలేదని, చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. శాంతి చర్చలను పాకిస్థాన్ ఎప్పుడూ తిరస్కరించలేదని, కానీ భారత్ మాత్రం చర్చలకు సానుకూల సంకేతాలు పంపడంలేదని ఆరోపించారు.

కశ్మీర్‌ విషయం చాలా సున్నితమైనదని, దీనిపై పాక్‌, భారత్‌, కశ్మరీ ప్రజల మధ్య చర్చలు జరగాలన్నారు. దీంతో సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.భారత్‌తో చర్చలను తామెప్పుడూ నిషేధించలేమని, రెండు దేశాల మధ్య సుధీర్ఘ చర్చలు జరగాల్సిన అవసరముందని ఖురేషి అభిప్రాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -