Wednesday, May 22, 2024
- Advertisement -

తెలుగు మీడియా తో సాహో డైరెక్టర్ మాట్లాడడా?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఎవరు మంచిగా ఎదగాలన్న దానికి మీడియా సహకారం తప్పకుండా అవసరం ఉంటుంది. మీడియా తో ఎంత మంచిగా ఉంటె, వారి గురించి అంత మంచిగా మీడియా లో ప్రాజెక్ట్ అవుతుంది అనేది అందరూ నమ్ముతారు. అందుకే కొత్తగా ఇండస్ట్రీ లో కి వచ్చే వాళ్ళు కూడా ఈ ప్రిన్సిపల్ ని బాగా ఫాలో అవుతూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం తెలుగు మీడియా ని ఒక దర్శకుడు దూరం చేసుకుంటున్నాడు.

సాహో సినిమా తో త్వరలో మన ముందుకు రానున్న సుజీత్ ఎందుకో గానీ తెలుగు మీడియా తో మాట్లాడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మొదటి నుంచి అప్డేట్స్ ఇవ్వడానికి అయినా సినిమా గురించి ముచ్చటించాడు అయినా తను ఎక్కువగా హిందీ మీడియా కె ప్రాముఖ్యత ఇస్తూ వస్తున్నాడు.కనీసం ట్విట్టర్ లో కూడా మీడియా కి సరిగా రెస్పాండ్ అవడం లేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా, మీడియా తో, అది కూడా తెలుగు సినిమా చేస్తూ తెలుగు మీడియా కి సరిగా అందుబాటులో ఉండకపోవడం కచ్చితంగా సుజీత్ కి డ్రా బ్యాక్ గా మారుతుంది అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -