Sunday, May 5, 2024
- Advertisement -

దుమ్మురేపుతున్న బిగ్ బాస్ 3 నాగార్జున ప్రోమో…

- Advertisement -

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో మూడో సీజన్ లోకి అడుగుపెట్టింది. త్వ‌ర‌లో మూడో సీజ‌న్ మొద‌లు కాబోతోంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌లుగా ఎవరు పాల్గొంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొదటి సీజన్లో ఎన్టీఆర్ అలరిస్తే.. రెండో సీజన్లో నాని మెరుపులు మెరిపించాడు. మూడో సీజన్లో హోస్ట్ గా ఎవరు ఉంటున్నారు అనే దానిపై అనేక అనుమానాలు అంచనాలు వచ్చాయి.

బిగ్ బాస్ తాజా సీజన్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తారు. ఈ మేరకు స్టార్ మా చానల్ టీజర్ రిలీజ్ చేసింది. కూరగాయల మార్కెట్ కు వచ్చిన నాగార్జున బస్తాలకు బస్తాలు కూరగాయలు కొనుగోలు చేయడంతో టీజర్ మొదలవుతుంది. తనను చూసి అమ్మకందార్లు ఆశ్చర్యపోతుండగానే, 14 మంది, 100 రోజులు, ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా అంటూ నాగ్ తనదైన శైలిలో డైలాగులు చెప్పి అలరించారు. మరి నాగార్జున ఈ షోను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

జూలై 21 నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. వంద రోజులపాటు నడిచే ఈ షోలో 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనున్నారు. వారాంతాల్లో హోస్ట్‌గా నాగార్జున అపియరెన్స్‌తో మహిళా ప్రేక్షకులు మరింతగా ఈ షోకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -