Friday, May 3, 2024
- Advertisement -

చిన్న సినిమాలపై ‘సాహో’ దెబ్బ

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. చాలాకాలం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. ఇంతకు ముందు వరకు ఆగస్టు 15న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు ఆగస్టు 30న విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ‘సాహో’ సినిమా వాయిదా పడటం వల్ల అదే రోజు విడుదల కావాల్సిన ‘ఎవరు’, ‘రణరంగం’ వంటి చిన్న సినిమాలు కూడా వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముందుగా హిందీ సినిమా ‘చిచ్చోరే’ సెప్టెంబర్ 6కి వాయిదా పడింది. నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కూడా సెప్టెంబర్ 13 లేదా సెప్టెంబర్ 20 కి వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. తాజాగా సూర్య హీరోగా నటించిన ‘కాప్పన్’ సినిమా కూడా సెప్టెంబర్ 20 కి వాయిదా వేశారట. అయితే ఈ రెండు సినిమాల అధికారిక విడుదల తేదీ గురించి ఇంకా ప్రకటన బయటకు రావాల్సి ఉంది. మరి కొన్ని రోజుల్లో ‘గ్యాంగ్ లీడర్’ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఏదేమైనా ‘సాహో’ సినిమా వాయిదా పడటం వల్ల ఆ ప్రభావం చిన్న సినిమాల మీద కూడా పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -