Monday, May 6, 2024
- Advertisement -

స్పెష‌ల్ సాంగ్‌లో ప్రభాస్ సరసన సంద‌డి చేయ‌నున్న హాలీవుడ్ ముదురు భామ‌..

- Advertisement -

బాహుబ‌ళి సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.ప్రస్తుతం దేశంలో ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరు. ప్ర‌భాస్ క్రేజీమ‌రింత మరింత పెంచేలా అంత‌ర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్‌తో సాహో సినిమా తెర‌కెక్కుతోంది. ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ప్రభాస్ నటిస్తోన్న చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానె బ‌డ్జెట్‌లో ఎక్క‌డా రాజీలేకుండా సినిమాను చిత్రీక‌రిస్తున్నారు.

దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో 1, 2లు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పాయి. అయితే తాజాగా ఈసినిమాపై వ‌స్తున్న వార్త మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సాహో’లో ప్రత్యేక గీతం కోసం పాప్ సింగర్‌గా, హీరోయిన్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటిష్ బ్యూటీ కైలీ మినోగ్ ను తీసుకున్న‌ట్లు స‌మాచారం. 2009లో అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘బ్లూ’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన కైలీ పదేళ్ల తరువాత మరోసారి ఇండియన్‌ సినిమాలో మ‌రో సారి న‌టిస్తోంది. ప్రభాస్ కన్నా కైలీ వయసు చాలా ఎక్కువ కావడం విశేషం. ప్రస్తుతం కైలీ వయసు 50 ఏళ్లు. ప్ర‌భాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -