Thursday, May 9, 2024
- Advertisement -

సీఎం స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి దిగ‌జారిన ప‌వ‌న్‌…

- Advertisement -

ఏపీలో అధికార పీఠంకోసం వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీలు హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. అధికారం మాదంటె మాద‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బాబు, జ‌గ‌న్ ఇలా చెప్ప‌డంలో త‌ప్పేమి లేదు కాని ప‌వ‌న్ మాత్రం అధికారం మాదే అంటూ చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌నే చెప్పాలి. ఎందుకంటె ఆరెండు పార్టీలు 175 నియోజ‌క వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల‌ను పోటీలో నిలిపారు. కాని ప‌వ‌న్ మాత్రం అన్ని స్థానాల్లో పోటీ చేయ‌కుండా చేతులెత్తేశారు.

ఇక అసలు విష‌యానికి వ‌స్తే మొద‌ట ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టిన ప‌వ‌న్ త‌ర్వాత నేను సీఎం అవుతానంటూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఊద‌ర‌గొట్టారు. నేను అసెంబ్లీలో అడుగు పెడ‌తా అంద‌రి తాట తీస్తా అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికి ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్రచారం చివ‌ర‌కు వ‌చ్చెటాల‌కు ప‌వ‌న్ టోన్ మారింది. ఇప్పుడు చౌక బాబు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

నన్న ఎమ్మెల్యేగా గెలువ కుండా ప్ర‌త్య‌ర్థి పార్టీలు అడ్డుకుంటున్నాయ‌ని వాపోయారు. అందు కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు..’ అని పవన్ కల్యాణ్ అనడం ఆయ‌న దివాలా కోరు త‌నానికి నిద‌ర్శ‌నం. నిన్నటి వరకూ ‘సీఎం అవుతా’ అని ప్రకటించుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యే కావడం గురించి ఛాలెంజ్ చేయడం విడ్డూరమే. ఎమ్మెల్యేగా గెలుస్తాన‌ని న‌మ్మ‌కం లేని ప‌వ‌న్ సీఎం అవుతాన‌ని చెప్ప‌డం ఆయ‌న అజ్ణానికి నిద‌ర్శ‌నం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -