Saturday, May 11, 2024
- Advertisement -

రివ్యూ : సాహో అభిమానులలో కలవరం

- Advertisement -

350కోట్లతో ఓ రేంజ్ లో తీసిన సినిమా..
బాహుబలి తరువాత అందరి ఆలోచనలూ 2ఏళ్ళు తన వైపు తిప్పుకున్న సినిమా..
బాలీవుడ్ బ్యూటీతో హైప్ పెంచుకున్న సినిమా.. అభిమానుల ఆశలను 3 గంటలలో నిరాశపరిచింది.
విడుదలకు ముందు ప్రభాస్ అభిమానులు ఎంత ఆనందంగా ఉన్నారో మనందరం చూశాం కానీ విడుదల తరువాత వాళ్ళ బాధ వర్ణననాతీతం. అటు బాగుంది అని చెప్పలేకపోతున్నారు, ఇటు బాలేదు అని నిజం ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే సినిమా బాలేదంటే ఫ్లాప్ అవుతుందేమోనన్న భయం… వాళ్ళ హీరో 2 ఏళ్ళకు ఒక సినిమాతో వస్తే అది వాళ్ళే ఎలా ఫ్లాప్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకు ప్రభాస్ కనపడితే పట్టుకోని ఏడ్చే పరిస్థితి వాళ్ళది, అంత బాధలో ఉన్నారు ప్రభాస్ అభిమానులు.

మామూలు హీరోల సినిమాలకే బెన్ఫిట్ షో అయ్యాక అభిమానులు అరుపులు, కేకలతో థియేటర్ల ముందు సందడి చేస్తారు, ఈ రోజు సాహో రిలీజ్… అదీ కాక 2 ఏళ్ళ తరువాత ప్రభాస్ ని హాలీవుడ్ రేంజ్ లుక్ లో చూశారు అభిమానులు, అయినా ఏ సందడీ లేదు… ఎక్కడి వారు అక్కడే నిలబడి పోయి బాగుంది బాగుంది అంటున్నారు. అసలయితే థియేటర్ల దగ్గర చాలా సందడి ఊహించారు జనాలు. తోపులాటలు జరుగుతాయని, కోట్లాటలు జరిగితే పరిస్థితి ఏంటి అని ఊహించిన వారికి పెద్ద షాకే తగిలింది. అభిమానుల సందడి కాదు కదా, అసలు వెళ్ళి అభిమానులకు యూట్యూబ్ ఛానెల్స్ మైక్ పెడితే బాగుంది అనే ఒకే ఒక మాటతో సర్ధుకుపోతున్నారు. హిట్ టాక్ ఏమో గానీ అసలు మాట్లాడే పరిప్థితే లేదు సాహో థియేటర్ల దగ్గర ప్రభాస్ అభిమానులకు.

నిజంగా చెప్పాలంటే ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ప్రేక్షకులు పర్లేదు అంటే హీరో అభిమానులు అదుర్స్ అంటారు, మరి ప్రభాస్ అభిమానులే పర్లేదు అన్నట్టు మొహంపెడితే ఇంక ప్రేక్షకులు ఏం అంటారో అన్నది తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -