Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీ నుంచి మూడు వికెట్లు డౌన్….షాక్ లో చంద్రబాబు

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీకీ జవసత్వాలు తీసుకురావాలని బాబు నానా పాట్లు పడుతున్నా అవేవి కలసిరావడంలేదు. ఏదో విధంగా జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయడంకోసం బాబు,లోకేష్ లు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. నాయకుల్లో ఆత్మవిశ్వాసం ఎంత నింపుతున్నా….ఆ పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు. పార్టీ మారేందుకు దారులు వెతుక్కుంటున్నారు.

తాజాగా మరో ముగ్గురు నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు తనయుడు ఆనంద్‌ కుమార్‌, పంచకర్ల రమేష్‌బాబు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. వీరు ఇద్దరూ పార్టీ మారితే టీడీపీకీ భారీ నష్టమే.ఆడారి ఆనంద్‌కుమార్‌ గత ఎన్నికల్లో టీడీపీ తరపున అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే పంచకర్ల రమేష్‌బాబు యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ప్రస్తుతం ఈ ఇద్దరి నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లా రైతుల్లో ఆడారి తులసీరావుకు మంచి పట్టుంది.సోదరుడి బాటలోనే తులసీరావు కుమార్తె, ఎలమంచిలి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారిద్దరిని ఆపడానికి బాబు మాజీ మంత్రి అయ్యన్నను రంగంలోకి దింపారు.అయితే అదేమీ వర్కవుట్ అయ్యేలా లేదు. ఆడారి ఆనంద్ వైసీపీలో చేరడం ఖాయమైపోయింది.సెప్టెంబర్‌ 1న విజయవాడలో జగన్‌ సమక్షంలో వీరు వైసీపీలో చేరుతారని సమాచారం.

పంచకర్ల రమేష్‌బాబు బీజేపీలోకి వెళ్లిపోతే భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న కాపు నేత వరుపుల రాజా కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేసారు.అదే సమయంలో ఆయన వైసీపీ అధినేత జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించడంతో ఆయన వైసీపీలో చేరుతారన్న విషయం స్పష్టమైపోయింది.

టీడీపీలో భవిష్యత్ లేదని డిసైడైపోయిన నాయకులు అటు వైసీపీలోనో.. ఇటు బీజేపీలోనో చేరిపోతున్నారు. మరి ఈ వలసలకు చంద్రబాబు అడ్డుకట్ట వేసే పరిస్థితి కనిపించడం లేదు. ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకొని ప్రజాసమస్యలపై పోరాడితే కొంత మేర ఉపశమనం కలుగుతుంది. లేక పోతె నెత్తిమీద తడి గుడ్డ వేసుకొని కూర్చోవడం తప్ప చేసేందేమిలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -