Sunday, April 28, 2024
- Advertisement -

రెండు రోజుల్లో సాహో కలెక్షన్లు ఇలా ఉన్నాయి

- Advertisement -

‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మరొక ప్యాన్ ఇండియన్ సినిమా గా ‘సాహో’ సినిమా ఆగస్ట్ 30 న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధ కపూర్, జాకీ శ్రోఫ్, నీల్ నితిన్ ముకేశ్, మందిర బేడీ, అరుణ్ విజయ్ వంటి స్టార్ కాస్ట్ కనిపించారు. అయతే విడుదలైన మొదటి రోజునుండే మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా రెండవ రోజున 10.30 కోట్లను వసూళ్లు చేసింది.

తాజాగా మొత్తం కలెక్షన్లు 46.30 కి చేరాయి. నైజాం ఏరియాలో ‘సాహో’ సినిమా 5.40 కోట్లు నమోదు చేసుకోగా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ‘సాహో’ సినిమా కి మంచి కలెక్షన్లు అందుతున్నాయి. అయితే నెల్లూరు లో సాహో సినిమా వసూళ్లు మహర్షి కలెక్షన్ ల కంటే తక్కువగా ఉన్నాయి. సీడెడ్ లో కూడా ‘సాహో’ పరిస్థితి ఏమంత బాగాలేదు. మరోవైపు పండుగ సెలవు వల్ల ‘సాహో’ కలెక్షన్లు బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ మంగళవారం నుండి ‘సాహో’ వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

సాహో ఏరియా వైస్ రెండు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

నిజాం: 14.62 కోట్లు
సీడెడ్: 6.05 కోట్లు
యూఏ: 5.21 కోట్లు
గుంటూరు: 5.43 కోట్లు
ఈస్ట్: 4.98 కోట్లు
వెస్ట్: 3.95 కోట్లు
కృష్ణ: 3.13 కోట్లు
నెల్లూరు: 2.89 కోట్లు

ఏపీ+తెలంగాణ: 46.26 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -