- Advertisement -

ఇక సుజిత్ సినిమాలకి గుడ్ బై చెప్పాల్సిందేనా

- Advertisement -

యువ దర్శకుడు సుజిత్ ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ అవడంతో సుజిత్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో రెండవ సినిమాతోనే ప్రభాస్ వంటి స్టార్ హీరోతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ‘సాహో’ సినిమాని యు.వి క్రియేషన్స్ వారు 300 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ వంటి ప్రముఖ నటీ నటులు మాత్రమే కాకుండా ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం మీద పాపులరైన టెక్నీషియన్లు మ్యూజిక్ డైరెక్టర్ లను సైతం రంగంలోకి దింపారు.

సినిమా ఎనౌన్స్ చేసిన అప్పటి నుంచి భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 30న విడుదల అయింది. కానీ మొదటి రోజు నుంచే సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకోగా తాజాగా ట్రేడ్ సినిమాని అతి పెద్ద డిజాస్టర్ గా తేల్చి చెప్పింది. ‘సాహో’ సినిమా ఫ్లాప్ అవడానికి గల కారణాల్లో మొదటి రీజన్ బడ్జెట్ అని కొందరు అంటున్నారు. సుజిత్ స్టామినా గురించి ఎస్టిమేట్ చేయకుండా నిర్మాతలు కోట్లు కోట్లు ధారపోసారని, ప్రాపర్ ప్లానింగ్ కూడా లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయిందని కొందరు చెబుతుండగా, మరి కొందరు సుజిత్ కి ఇదే ఆఖరి సినిమా అని తేల్చి చెప్పేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -