Tuesday, April 30, 2024
- Advertisement -

‘సాహో’ సంగీత దర్శకుడి పై దాడి

- Advertisement -

గురు రాంధ్వా.. ఈ పేరు తెలియని బాలీవుడ్ సంగీత ప్రియులు ఉండరు. అయితే ఈయన ఇప్పుడు తెలుగు లో కూడా రంగ ప్రవేశం చేశారు. నిన్న సాహో చిత్రం నుంచి విడుదల అయినా ఒక పాట ద్వారా ఆయన తెలుగు పరిశ్రమ లో కూడా అడుగు పెట్టారు. ఈ పాట గురించి ముందు నుంచి ఎంతగానో ప్రమోట్ చేశారు గురు. అయితే ఈ సినిమా ప్రోమో మాత్రమే విడుదల చేసిన టీమ్, పూర్తి వీడియో ని 2 వ తారీఖున బయటకు వదలనున్నారు.

అయితే గురు మీద కెనడా లో దాడి జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హైలైట్ అవుతుంది. ఈ సాహో సంగీత దర్శకుడు తన మ్యూజిక్ టూర్ కోసం అమెరికా వెళ్లారు. అమెరికా మరియు కెనడా దేశాల్లో ప్రదర్శనలు సైతం ఇస్తున్నారు. అయితే ఒక చోట ప్రదర్శన అనంతరం గురు స్టేజ్ దిగి వస్తుంటే ఒక పంజాబీ యువకుడు నేరుగా గురు మొహం మీద గుద్దడం తో వెంటనే గురు ముక్కు నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిందట.

ప్రస్తుతం గురు చికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం కుదురుగా నే ఉంది అని ఆయన టీమ్ వెల్లడించింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -