Thursday, May 9, 2024
- Advertisement -

హీరోగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామీలి నుండి మ‌రో హీరో ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాడు.మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్ మంచి న‌టుడిగా , మంచి డ్యాన్సర్‌గా పేరు సంపాదించాడు.ఇప్పుడు ఈయ‌న త‌మ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. గ‌త కొంత‌కాలంగా ఈ విష‌యంపై జ‌రుగుతున్న ప‌రిణామాలు ఓ కొలిక్కి వ‌చ్చినట్లు తెలుస్తుంది.మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా గ్రీన్ సిగ్ర‌ల్ వచ్చిన‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాకు అవ‌స‌రాల శ్రీనివాస‌రావు ద‌ర్శ‌కుడిగా ప‌ని చేస్తున్నారు.సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు.వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా రాణిస్తాడేమో చూడాలి. ఇప్ప‌టికే చిరంజీవి ఫ్యామీలి నుండి చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.మ‌రోవైపు చిరంజీవి రెండ‌వ కుమార్తె శ్రీజ భ‌ర్త క‌ల్యాణ్ కూడా హీరోగా ప‌రిచియం అవుతున్నాడు. ఈ సినిమాను కూడా సాయి కొర్రపాటే నిర్మిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -