మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు కాలం కలిసి రావడం లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లు కొట్టిన సాయి ధరమ్ తేజ్ తరువాత వరుస ఫ్లాప్‌లతో రేసులో బాగా వెనుకపడ్డాడు. ఈసారి హిట్ కొట్టకపోతే ఇండస్ట్రీలో నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు. దీంతో రెండు వరుస హిట్లు కొట్టిన కిషోర్ తిరుమలతో చిత్రలహరి సినిమాను మొదలు పెట్టాడు. సినిమా టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు సాయి ధరమ్ తేజ్. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు( బుధవారం) విడుదల చేశారు. సినిమా టీజర్‌లో నాలుగు పాత్రలను పరిచియం చేశాడు దర్శకుడు. వాటిలో మొదటి రెండు పాత్రలు హీరోయిన్లవి కాగా, మరోకటి కమెడియన్ సునిల్‌ది. లాస్ట్‌లో హీరో సాయి ధరమ్ పాత్రను పరిచియం చేశారు.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ విజయ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. పేరులో విజయ్ ఉంది కాని , జీవితంలో విజయంలో విజయం లేదని తెగ బాధపడిపోతుంటాడు. బాధపడుకరా నీకు కూడా మంచి రోజు వస్తుంది అని కమెడియన్ అనగా …ఆ వచ్చేదేదో ఆదివారం రమ్మనర్రా నేను కూడా ఖాళీగా ఉంటాను అని సాయి ధరమ్ చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలెట్ అని చెప్పాలి. మరి వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న సాయ్ ధరమ్ తేజ్‌కు ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందేమో చూడాలి.
- Advertisement -
సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ టీజర్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -