Sunday, May 4, 2025
- Advertisement -

ఈసారైనా మెగా హీరోకు ‘దేవుడు వరమందిస్తే’ చూడాలి

- Advertisement -

మెగావారసుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైన మెగా అల్లుడు సాయిధరమ్‌ తేజ్ వరుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉన్నాడు. విజయాలు లేక ఆందోళ‌న‌లో ఉన్న సాయిధరమ్ ఆ త‌ర్వాత ఇప్పుడు మ‌రో సినిమాతో బిజీగా ఉన్నాడు. రొటీన్‌, మాస్‌ ఫార్ములా సినిమాలు చేస్తూ సాయిధ‌ర‌మ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

ఇప్పుడు కరుణాకరన్ దర్శకత్వంలో డిఫరెంట్ లవ్‌స్టోరితో సాయిధ‌ర‌మ్ తేజ్ నటిస్తున్నాడు. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీలను తెరకెక్కించే కరుణాకరన్‌తో ఈసారి జ‌త క‌డుతున్న సాయిధ‌ర‌మ్ తేజ్ ఓ హిట్ సినిమా పొందాల‌ని క‌సిగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నఈ సినిమాకు ‘దేవుడు వరమందిస్తే’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్ ప‌క్క‌న అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -