Wednesday, May 15, 2024
- Advertisement -

బావ ఫ‌ట్‌… బామర్ది హిట్…

- Advertisement -

సినీ ప‌రిశ్ర‌మ‌లో మెగా కుటుంబం చాలా పెద్ద‌ది. ఆ కుటుంబంలో దాదాపు డ‌జ‌న్ మంది న‌టులు వ‌చ్చారు. అయితే తొలిసారి ఈ కుటుంబానికి చెందిన ఇద్ద‌రు హీరోల సినిమాలు ఒకేసారి వ‌చ్చాయి. బావ‌మ‌రుదులు అనుకోకుండా ఒక రోజు గ్యాప్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అభిమానుల ఆందోళ‌న‌ను గ‌మ‌నించిన నిర్మాత‌లు సినిమాల‌ను ఒక రోజు ముందుకు, వెన‌క్కు పంపించి విడుద‌ల చేశారు. ఈ నేప‌థ్యంలో బావ‌మ‌రుదులు న‌టించిన ఇంటిలిజెంట్‌, తొలిప్రేమ సినిమాలు ఎలా ఉంటాయోన‌ని ప్రేక్ష‌కులు ఆతృత‌గా ఎదురుచూశారు. చివ‌రికి ఒక‌రు విజ‌యం పొంది మ‌రొక‌రు ప‌రాజ‌యం పొందడం గ‌మ‌నార్హం.

వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఇంటిలిజెంట్‌’గా వ‌రుణ్‌తేజ్ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 9) థియేట‌ర్ల‌కు వ‌చ్చాడు. ఆ త‌ర్వాతి రోజు అంటే శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 10) వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’గా ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చాడు. అయితే వీరిద్ద‌రు సినిమాల‌పై అంచ‌నాలు బాగానే ఉన్నాడు. మొద‌టి నుంచి త‌న బాబాయి మాదిరిగా తాను హిట్ కొడ‌తాన‌ని వ‌రుణ్ ధీమాగా ఉన్నాడు. అన్న‌ట్టుగానే ‘తొలిప్రేమ’ సూప‌ర్‌హిట్ సినిమాగా టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

అయితే సాయిధ‌ర‌మ్‌తేజ్ కేవ‌లం ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్‌పై న‌మ్మ‌కంతో ధీమాగా ఉండి థియేట‌ర్ల‌కు వ‌చ్చాడు. అయితే సాయిధ‌ర‌మ్‌తేజ్ గ‌త సినిమాల మాదిరిగానే ఫ్లాపు అందుకున్నాడు. ఈ సినిమా ఒక టాప్ ద‌ర్శ‌కుడు తీశాడా అని అనిపించేలా ఉంది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం లేదు. దీంతో బావ వ‌రుణ్‌తేజ్ హిట్ అయ్యాడు… సాయిధ‌ర‌మ్‌తేజ్ ఫ‌ట్ట‌య్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -