Wednesday, May 15, 2024
- Advertisement -

‘తొలిప్రేమ’కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ‘ఫిదా’

- Advertisement -

ఇటీవ‌ల విడుద‌లైన ‘తొలిప్రేమ’ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. కొత్త త‌ర‌హా సినిమా ఉండ‌డంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అయితే ఈ సినిమా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కూడా ఫిదా చేసింది. వ‌రుణ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ‘తొలిప్రేమ’ సినిమా శనివారం విడుదలైంది.

ఈ సినిమాను శనివారం రాత్రి తెలంగాణ ఐటీ, మున్సిప‌ల్‌, చేనేత‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చూశారంట‌. సినిమా బాగుందని ట్విటర్‌లో ప్రశంసలు కురిపించారు.

‘శనివారం రాత్రి సరదాగా గడిచిపోయింది. ‘తొలిప్రేమ’ సినిమా చూశా. చాలాకాలం తరువాత తెలుగులో ఓ చక్కటి ప్రేమకథా చిత్రం చూశా. వెంకీ అట్లూరి సినిమాను చాలా బాగా తీశారు. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. వరుణ్‌ తేజ్‌, రాశీఖన్నా చాలా బాగా నటించారు’ అంటూ కేటీఆర్‌ ట్విట్ చేశారు.

కేటీఆర్‌ ట్వీట్‌కు హీరోయిన్ రాశీఖన్నా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌ స్పందించారు. ‘మీకు సినిమా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సర్‌’ అని రాశీఖ‌న్నా ట్వీట్ చేసింది. మీ అభినంద‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు సార్ అని త‌మ‌న్ రిప్ల‌య్ ఇచ్చాడు.

ఇటీవ‌ల కేటీఆర్ సినిమాలపై ప్ర‌త్యేక ఆస‌క్తి పెట్టారు. గతంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ ‘అర్జున్‌ రెడ్డి’, వ‌రుణ్‌తేజ్ ‘ఫిదా’ సినిమాల‌ను చూసి ప్ర‌శంసించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -