Thursday, May 9, 2024
- Advertisement -

ఈ సారి సాయి ధరమ్ పాత్ర ఏంటో తెలుసా?

- Advertisement -

చిత్రలహరి విజయం సాయి ధరమ్ తేజ్ ని ఎంతో కొంత కెరీర్ లో నిలదొక్కుకునేలా చేసింది అంటే అతిశయోక్తి కాదు. ఆరు పరాజయాల తర్వాత వచ్చిన విజయం కనుక అది హీరో కి బాగా నే ఉపయోగపడింది. త్వరలో సాయి మారుతీ దర్శకత్వం లో ఒక సినిమా లో నటించనున్నాడు అనే వార్తలు అంతటా వింటున్నాము. ఇప్పటికి అయితే ఈ సినిమా పైన ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా లో హీరోయిన్ గురించి కూడా చాలా రూమర్స్ నడిచాయి. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

తాజా ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ ఒక కాసనోవా పాత్ర లో కనిపించనున్నాడట. ఇలాంటి పాత్ర సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లో ఎప్పుడూ చేయలేదు. అందుకే ఇది ఎట్టి పరిస్థితి లో అయినా బాగా రావాలనే తాపత్రయం లో ఉన్నాడట. ఇప్పటికే ఈ సినిమా లో తన పాత్ర కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నాడు అని తెలుస్తుంది. భోగి అనే టైటిల్ తో ఈ సినిమా మన ముందుకు రానుంది అని వినికిడి.

గీత ఆర్ట్స్ బానర్ మీద ఈ సినిమా నిర్మింపబడనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -