హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి గురించి రెండు రోజుల క్రితం మీడియాలో ఓ వార్త వచ్చింది. హీరోయిన్ అమలాపాల్ మాజీ భర్త, తమిళ దర్శకుడు విజయ్‌తో సాయి పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. విజయ్ దర్శకత్వంలో కణం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమించుకున్నారని, త్వరలోనే వీరు పెళ్లికి రెడీ అవుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తనపై వచ్చిన వార్తలపై స్పందించింది సాయి పల్లవి. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తన పెళ్లిపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది.
దర్శకుడు విజయ్ కూడా సాయి పల్లవితో పెళ్లి వార్తలు నిజం కావని తేల్చేశారు. తనపై రకరకాల వదంతులు పుట్టిస్తూనే ఉన్నారని, ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని, ఇకనైనా వదంతులు కట్టిపెట్టాలని ఆమె ఘాటుగా స్పందించింది. దయ చేసి ఇక మీద ఇలాంటి వార్తలు రాయకండని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఇక దర్శకుడు విజయ్ విషయానికి వస్తే గతంలో హీరోయిన్ అమలాపాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తరువాత వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తరువాత తిరిగి సినిమాల్లో నటిస్తుంది అమలాపాల్.
- Advertisement -
దర్శకుడితో పెళ్లి వార్తలపై ఘటుగా స్పందించిన సాయి పల్లవి
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -