Sunday, May 4, 2025
- Advertisement -

డిజాస్టర్ హీరో, దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి?

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంత కాలంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వారిలో సాయిపల్లవి ముందుంటారు. సాయి పల్లవి ఒక సినిమాలో నటిస్తుంది అంటే ఆ సినిమా పక్కా హిట్ అవ్వడం ఖాయం. ఆమె సినిమా సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కథల విషయంలో ఎంతో కచ్చితంగా ఉండే సాయి పల్లవి తాజాగా ఒక డిజాస్టర్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఒకప్పుడు ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో నితిన్ ఈ మధ్య వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. లవ్ కాన్సెప్టు లకు చాలా గ్యాప్ ఇచ్చిన నితిన్ హీరోగా, నా పేరు సూర్య సినిమాతో డిజాస్టర్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి సాయి పల్లవి ఒప్పుకున్నారనే సమాచారం వినబడుతోంది.

Also read:ప్రేమలో పడిన యాంకర్ వర్షిని.. ఫోటోలు వైరల్!

దర్శకుడు వక్కంతం వంశీ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉండటంతో సాయిపల్లవి ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వక్కంతం వంశీ, నితిన్ కాంబో అంటేనే ఎంతో మంది హీరోయిన్లు ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాని సాయి పల్లవి మాత్రం ఆలోచించకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.డిజాస్టర్ హీరో డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వీరికి సాయి పల్లవి హిట్ అందిస్తుందో లేదో వేచి చూడాలి.

Also read:మల్టీ స్టారర్ గా ఎనర్జిటిక్ హీరోతో రెడీ అవుతున్న క్రాక్ హీరో.. దర్శకుడు ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -