Friday, March 29, 2024
- Advertisement -

భానుమ‌తి చెల్లెలును చూశారా… స్పెయిన్‌లో అక్కాచెల్లెళ్ల సంద‌డి

- Advertisement -

ఒకే ఒక్క సినిమా.. ఒకే ఒక్క డైలాగ్‌తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను, తెలుగు సినీ ప్రేక్ష‌క జ‌నాల‌ను ఆక‌ట్టుకున్న అమ్మ‌డు భానుమ‌తి. అదేనండీ సాయిప‌ల్ల‌వి. ఫిదా సినిమాతో కుర్ర‌కారేంటి.. ఇంటిల్లిపాదీ మ‌న‌సుల‌ను గెలుచుకున్న సాయిప‌ల్ల‌వి వ‌రుస సినిమాలు చేయ‌డంతో కొంచెం రిలాక్స్ అవుదామ‌ని విదేశాల‌కు చెక్కేసింది. త‌న సోద‌రితో క‌లిసి ఎంజాయ్ చేసేస్తోంది.

త‌న సోద‌రి పూజ క‌న్న‌న్ సాయిప‌ల్ల‌వికి పోటీగా ఉంది. అక్క‌ను మించి అందం ఆమె సొంతంగా క‌నిపిస్తోంది. ఇద్ద‌రు డిట్టో ఉన్నారు. అండాల (క‌వ‌ల‌) పిల్ల‌లు లెక్క‌. వీరిద్ద‌రూ క‌లిసి మంచు ప్ర‌దేశాల్లో గ‌డిపారు. స్పెయిన్‌లోని సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల్ల‌న్నీ చెల్లెలితో క‌లిసి సాయిప‌ల్ల‌వి సంద‌ర్శించింది. ఈ విష‌యాల‌ను పూజా క‌న్న‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అక్కాచెల్లెలు స‌ర‌దాగా గ‌డిపారు. దానికి సంబంధించిన చిత్రాలు చూడండి.

ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి నాని స‌ర‌స‌న న‌టించిన ఎంసీఏ సినిమా ఈనెల 21వ తేదీన విడుద‌ల కానుంది. ఇంకోటి క‌ణం సినిమాలో న‌టిస్తోంది. మ‌రికొన్ని సినిమా ప్రాజెక్టుల‌కు ఓకే చెప్పాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -