Saturday, May 4, 2024
- Advertisement -

మళ్లీ అదరగొట్టేలా కనిపిస్తున్నాడు

- Advertisement -

చిన్నపాత్రలతో గుర్తింపు పొందిన శ్రీవిష్ణు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో సినీ జనాలకు..బాగా నచ్చేశాడు. ఎలాంటి ఇమేజ్ లేని అతగాడిని మెయిన్ హీరోగా పెట్టి అలాంటి వెయిటున్న కథను తెరకెక్కించడం.. అందులోని పాత్రకు శ్రీవిష్ణు పూర్తిగా న్యాయం చేయడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమే. నటుడిగా అది విష్ణుకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇతడి కెరియర్లో ఇదొక మలుపు అని చెప్పవచ్చు. రీసెంట్ గా ‘మెంటల్ మదిలో’ చిత్రంతో మరో మంచి హిట్ ఇచ్చి… ప్రేక్షకుల్ని పలకరించాడు శ్రీవిష్ణు. ఐతే ఈ సినిమా ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కొట్టలేకపోయింది. దానికి కారణం… చాలా మంచి చిత్రాలు ఈసినిమా వచ్చిన టైమ్లో రిలీజ్ కావడం.

తాజాగా విష్ణు ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ఇపుడు లాంచ్ అయింది.ఇది చూస్తుంటే… డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న సినిమా అని ఈ పోస్టర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. కొత్తగా.. వెరైటీగా అనిపిస్తోంది ఈ పోస్టర్. ఇందులో విష్ణు లుక్స్ కూడా చాలా డిఫరెంటుగా ఉన్నాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను తలపిస్తున్నాయి. ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసిన అదే టీమే దీన్ని కూడా నిర్మించడం విశేషం. నారా రోహిత్ సమర్పణలో విష్ణు భార్య ప్రశాంతి.. అతడి మిత్రుడు కృష్ణవిజయ్ కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. వేణు ఊడుగుల ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మోషన్ పోస్టర్ తో ఆకట్టుకున్న చిత్ర బృందం సినిమాతోనూ మెప్పిస్తుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -