Tuesday, May 21, 2024
- Advertisement -

షాకింగ్… సాయిపల్లవి వ్యక్తిత్వంపై నాగశౌర్య తీవ్ర విమర్శలు… ఎగస్ట్రాలు వద్దని శౌర్యాకు కౌంటర్స్

- Advertisement -

ఫిదా సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిపై స్మాల్ హీరో నాగశౌర్య విమర్శల వర్షం కురిపించాడు. సెట్స్‌లో సాయిపల్లవి తనను తీవ్రంగా అవమానించిందని చెప్పుకొచ్చాడు. సాయిపల్లవి, నాగశౌర్యలు కలిసి ‘కణం’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాను నాగశౌర్యకంటే సాయిపల్లవికే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చారు. ఇక ప్రమోషన్స్ సందర్భంగా కూడా ఈ కణం సినిమాను సాయిపల్లవి సినిమాగానే ప్రొడ్యూసర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఈ చిన్న హీరో ఇగోను దెబ్బకొట్టినట్టుగా ఉందని సినిమా విమర్శకులు అంటున్నారు.

నిజానికి సాయిపల్లవితో పోల్చుకుంటే నాగశౌర్య స్టార్ స్టేటస్ చాలా తక్కువ. ఒకటి రెండు యావరేజ్ హిట్స్ తప్ప ఇప్పటి వరకూ నాగశౌర్య బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రూవ్ చేసుకుంది ఏమీ లేదు. అందుకే కణం లాంటి మల్టీలాంగ్వేజ్ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా సూపర్ క్రేజ్ ఉన్న సాయిపల్లవి సినిమాగా ప్రమోట్ చేస్తే బిజినెస్ బాగా అవుతుందన్నది ‘కణం’ నిర్మాతల ఆలోచన. అదే ఇప్పుడు నాగశౌర్య ఇగోను హర్ట్ చేసినట్టుగా ఉంది. అందుకే పరోక్షంగా సాయిపల్లవి వ్యక్తిత్వం మంచిదికాదని, బాగా పొగరుగా ప్రవర్తిస్తుందని విమర్శలు చేశాడు నాగశౌర్య. అలాగే ఫిదా హిట్ క్రెడిట్ మొత్తం తనదే అనుకుంటుందని, అయితే ఆ సినిమా హిట్టవ్వడానికి ఇంకా చాలా కారణాలున్నాయని చెప్పుకొచ్చాడు నాగశౌర్య. ఒక్క సినిమా హిట్టయినందకే ఈ రేంజ్‌లో పొగరుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని విమర్శలు చేశాడు శౌర్య.

అయితే నాగశౌర్య యాటిట్యూడ్ గురించి తెలిసిన ఇండస్ట్రీ జనాలు మాత్రం శౌర్యనే తప్పు పడుతున్నారు. ఆ మధ్య ఒక యావరేజ్ హిట్ వచ్చిన సందర్భంలో తనను కలవాలని ప్రయత్నించిన సీనియర్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌ని కూడా అవమానించాడు శౌర్య. అన్నింటికీ మించి మనవాడు కనీసం ఫోన్ కూడా మెయింటెయిన్ చెయ్యడు. అలాగే సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌ని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ అవమానించడాన్న విమర్శలు ఉన్నాయి. అలాగే ఒక్క హిట్ పడగానే కోటి రూపాయల రెమ్యూనరేషన్‌ని దాటించేసిన ఘనుడు నాగశౌర్య అని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాయిపల్లవి లాంటి స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిది పొగరుగా నాగశౌర్యకు కనిపిస్తే అది శౌర్య తప్పే అవుతుందని…….అన్నింటికీ మించి యాక్టింగ్ స్కిల్స్, బాక్స్ ఆఫీస్ స్టామినా విషయంలో కచ్చితంగా నాగశౌర్య కంటే సాయిపల్లవి ఎన్నో రెట్లు బెటరని….ఒక హీరోయిన్ తనకంటే ఎక్కువ స్థాయిలో ఉండడం, సెట్స్‌లో సాయిపల్లవికే ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రమోషన్స్‌లో కూడా సాయిపల్లవికి ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని తట్టుకోలేక నాగశౌర్య అనవసరమైన విమర్శలు చేస్తున్నాడని ఇండస్ట్రీ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఎగస్ట్రా యాక్టివిటీస్ కాస్త తగ్గించి ….ఇగో తగ్గించుకుని కెరీర్‌పైన కాన్సన్‌ట్రేట్ చేస్తే అది శౌర్యాకే మంచిదని క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -