Monday, April 29, 2024
- Advertisement -

కూతురు ముందే భార్య‌తో శృంగారం గురించి చెప్పిన సైఫ్ అలీఖాన్‌

- Advertisement -

బాలీవుడ్‌లో ఉన్న‌వి ఉంటే ఉన్న‌ట్లు చెప్పేవారు చాలామంది ఉంటారు.గ‌తంలో చాలామంది ఇలానే చెప్పి ఇబ్బంది ప‌డ్డారు.తాజాగా మ‌రో హీరో ఇలాంటి కామెంట్స్ చేసి ఇరక‌టంలో ప‌డ్డాడ.బాలీవుడ్‌లో మోస్ట్ పాపుల‌ర్ రియాల్టీ షో టాక్ వీత్ క‌ర‌ణ్ జోహార్ షోకి వ‌చ్చారు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ,ఆయ‌న కూతురు సారా అలీఖాన్.సైఫ్ అలీఖాన్‌కు రెండు పెళ్లిళ్లు అయిన సంగ‌తి తెలిసిందే.మొద‌టి భార్య కూతురే సారా అలీఖాన్.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు సైఫ్.వీరిద్ద‌రి క‌లిసి తైమూర్‌కు జ‌న్మనిచ్చారు.ఇక ఈ షోలో త‌న మొద‌టి భార్య గురించి అడిగిన ప్ర‌శ్న‌కు షాకింగ్ అన్స‌ర్ ఇచ్చాడు సైఫ్‌. కరీనాకపూర్ పెళ్లి తరువాత కూడా తన ఫిజిక్ ని చక్కగా మైంటైన్ చేస్తూ కసరత్తుల విషయంలో గోల్స్ సెట్ చేస్తోంది.

కొడుకు పుట్టిన తరువాత కాస్త లావు అయిందనే కామెంట్స్ వినిపించాయి. దీంతో అతి తక్కువ సమయంలో బరువు తగ్గించుకొని స్లిమ్ గా మారిపోయింది. జిమ్ లోనే ఎక్కువ సమయం గడిపే కరీనాను బాలీవుడ్ లో జిమ్ హాలిక్ అంటుంటారు.ఈ షోలో మీ భార్య జిమ్ లుక్ గురించి ఏం చెబుతారు అని అడ‌గ్గా…దానికి సైఫ్ ఆమె జిమ్ లుక్ ను అందరూ ఒకలా చూస్తే తాను మాత్రం బెడ్ రూమ్ లో క్లోజప్ లుక్ లో వీక్షిస్తానంటూ హాట్ కామెంట్స్ చేశాడు.ఇలాంటి కామెంట్స్ కొత్త కాక‌పోయిన‌ప్ప‌టికి కూతురిని ప‌క్క‌న పెట్టుకుని ఇలాంటి మాట‌లు మాట్లాడ‌టం చాలా దారుణం అని అంటున్నారు.దీంతో సోషల్ మీడియాలో సైఫ్ పై విమర్శలు మొదలయ్యాయి. కూతురి ముందు ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదా..? అంటూ సైఫ్ పై మండిపడుతున్నారు. మ‌రి దీనిపై ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తాడో సైఫ్ చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -