Friday, May 3, 2024
- Advertisement -

బాహబలి రికార్డు… సల్మాన్ చేతిలో తృటిలో బతికి బయటపడింది!

- Advertisement -

ఓపెనింగ్ డే రికార్డ్స్.. ఈ విషయంలో బాహులి రికార్డు మరోసారి బతికి బయటపడింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి తొలి రోజు ఆ సినిమా వసూలు చేసిన మొత్తం 42 కోట్ల చిల్లర పైకాన్ని అధిగమించడంలో మరో సినిమా కూడా ఫెయిలయ్యింది. బాహుబలి రికార్డును బద్దలు కొడతాడు అనుకున్న సల్మాన్ ఖాన్ తృటిలో ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు.

సల్మాన్ హీరోగా సూరజ్ ఆర్ బరత్యాజ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా హిందీ, తెలుగుతో సహా అన్ని వెర్షన్లలో కలిపి దాదాపు 41 కోట్ల రూపాయల ఓపెనింగ్ డే కలెక్షన్లను సాధించినట్టుగా తెలుస్తోంది.

ఈ మొత్తం బాహుబలి సినిమా తొలి రోజు సాధించిన వసూళ్ల కన్నా తక్కువ! దీని కన్నా కొంత మొత్తం మాత్రమే బాహుబలి సాధించింది. దాదాపు కోటిన్నర రూపాయ మొత్తం తో బాహుబలి రికార్డు భద్రంగా నిలిచింది. ఈ విధంగా తెలుగు వాళ్ల సినిమా పై రేంజ్ ను నిలెబెట్టుకుంది. అయితే ఈ సారి సల్మాన్ చాలా దగ్గరకు వచ్చి వెనుకంజ వేశాడు. మరి బాహుబలి రికార్డును వేరే ఎవరైనా అధిగమిస్తారో లేదో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -