Thursday, May 16, 2024
- Advertisement -

ఎంతకాలం ఈ వెయిటింగ్?

- Advertisement -

ముందు కథ కోసం కష్టపడ్డారు. తర్వాత హీరోయిన్ కోసం కసరత్తు చేశారు. ముద్దుల కొడుకు చెర్రీ.. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఉంటానని కూడా ప్రకటించారు. చివరికి పూరీ జగన్నాథ్ ఎపిసోడ్ తో.. ఈ షో అంతా… థియేటర్స్ కు వెళ్లకుండా… మెగాస్టార్ ఇంటికి బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇంత జరిగాక కూడా..

చిరంజీవి ఎక్కడా డైరెక్ట్ గా స్పందించలేదు. ఒకటి రెండూ ఆడియో ఫంక్షన్లకు అటెండైనా.. మాట మాత్రం మాట్లాడలేదు. తనకు ఠాగూర్ లాంటి వన్ ఆఫ్ ద కెరీర్ బెస్ట్ సినిమా ఇచ్చిన వీవీ వినాయక్.. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్ అని మీడియాకు కాస్త  లీకులు ఇచ్చారు. అఖిల్ సినిమా ఇచ్చిన రిజల్ట్ ఆధారంగా.. చిరు మూవీని ప్టటాలెక్కించేందుకు రెడీ అయ్యారు.

తీరా చూస్తే.. అఖిల్ కు నెగెటివ్ టాక్ నడుస్తోంది. కలెక్షన్ల విషయం బాగానే ఉన్నా… మిగతా రిపోర్ట్స్ ల్లో సినిమా డల్ అవుతోంది. ఇది చూసి.. మెగా క్యాంప్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ముందు మాటిచ్చిన ప్రకారం.. వినాయక్ తోనే సినిమా చేయాలా? లేదంటే.. ఇంకా ట్రై చేస్తున్న పూరీ జగన్నాథ్ కు ఆ బాధ్యత అప్పజెప్పాలా? వీరిద్దరూ కాదంటే.. మాటల మాంత్రికుడు, తమ్ముడు పవన్ క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చాన్స్ ఇవ్వాలా అన్నది అర్థం కాక అయోమయంలో పడ్డట్టే కనిపిస్తోంది.

జక్కన్న రాజమౌళితో సినిమా చేద్దామంటే ఎలాగూ చాన్స్ దొరకదు. పోనీ తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ తో చేద్దామంటే ఆయన అంత ఈజీగా లొంగడు. మిగిలిన వాళ్లలో.. శ్రీనువైట్లను ఇప్పటికే బ్రూస్ లీ ఎఫెక్ట్ తో చిరు అండ్ కో దూరం పెడుతోంది. క్రిష్ తో తీద్దామంటే.. ఇప్పటివరకు పెద్ద హీరోలతో భారీ సినిమాలు చేసిన ట్రాక్ రికార్డ్ లేదు. పోనీ.. నందమూరి నటసంహానికి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో సినిమా చేద్దామన్నా.. మళ్లీ గ్రౌండ్ వర్క్ సెట్ చేయాలి. ఇవన్నీ కాదంటే.. ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాసే.. మెగా క్యాంప్ ఫైనల్ చాన్స్ గా కనిపించే చాన్స్ ఉంది. ఈ లెక్కలన్నీ తేలాలంటే.. చిరు నోరు విప్పాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -