Monday, May 6, 2024
- Advertisement -

తెలుగు హీరోల మీద సల్లూ ప్రేమ , ఏంటి సంగతి ?

- Advertisement -

‘సల్మాన్ ఖాన్’ ఈ మధ్య కాలం లో తెలుగు మీడియా లో ఎక్కువగా వినపడుతోంది ఈ పేరు, సల్లూ భాయ్ అంటూ ఇక్కడి హీరోలు ముద్దుగా పిలుచుకునే సల్మాన్ తెలుగు హీరోల మీద ఆ మాటకొస్తే దక్షిణాది హీరోల మీద తెగ ప్రేమ కురిపిస్తున్నాడు.

చిరంజీవి మీద అభిమానం తో ఆయన కొడుకు చరణ్ తో ఉన్న స్నేహబంధం తో చిరంజీవి అరవయ్యవ పుట్టిన రోజు కి హాజరు అయ్యాడు సల్మాన్ ఖాన్. మళ్ళీ ఇప్పుడు బొమ్మరిల్లు సిద్దార్థ్ తో స్నేహబంధం కురిపిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల కి షారూఖ్, అమీర్ తెలియని రోజుల్లో ప్రేమ పావురాలు , ప్రేమాలయం లాంటి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు మళ్ళీ ప్రేమ లీల లో ఏకంగా రాం చారణ్ తో డబ్బింగ్ చెప్పించి మరీ రంగంలోకి దిగాడు సల్లూ భాయ్. ఇప్పుడు తెలుగు – తమిళ హీరో సిద్దార్థ్ తో సల్మాన్ ఖాన్ స్నేహం చర్చ కి దారి తీస్తోంది. బొమ్మరిల్లు తరవాత సరైన హిట్ కొట్టలేకపోయిన బొమ్మరిల్లు సిద్దార్థ్ తెలుగు నుంచి పూర్తిగా తమిళానికి షిఫ్ట్ అయ్యి చాలాకాలం అయ్యింది. అక్కడ ఈ మధ్య జిగార్తాండ సినిమాతో హిట్ కొట్టాడు, దాన్ని తెలుగు లో ” చిక్కడు దొరకడు ” అంటూ డబ్బింగ్ చేసి మరీ విడుదల విషయంలో మీనమేషాలు లేక్కబెడుతున్నాడు . ఇంతకీ విషయం ఏంటంటే సల్మాన్ ఖాన్ సిద్దార్థ్ కి సంబంధించిన కొత్త సినిమా ‘ జిల్ జింగ్ జిక్ ‘ సినిమా కోసం సిద్దార్థ్ తో స్నేహం మొదలెట్టాడు. దీపావళి రోజున సాయంత్రం ఆరుగంటల కి ఆ సినిమా లోని ఒక పాటని సల్మాన్ ఖాన్ విడుదల చెయ్యబోతున్నాడు. ఎలాంటి ఫంక్షన్ గురించీ చెప్పలేదు కాబట్టి ట్విట్టర్ లో విడుదల చేస్తారేమో మరి.  ఏదేమైనా తెలుగు హీరోల మీద ప్రేమ కారిపోతోంది సల్మాన్ ఖాన్ కి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -