Thursday, May 23, 2024
- Advertisement -

నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలి శ్రీదేవి కి పులి నిర్మాతల షాక్..

- Advertisement -

ఇరవై ఏళ్ళ భారీ గ్యాప్ తరవాత పులి సినిమాతో ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన హీరోయిన్ శ్రీదేవి ఇప్పుడు ఆ రీ ఎంట్రీ విషయంలో ఏ రకంగా కూడా సంతోషంగా లేదు.

ఆమె కి చెప్పిన స్క్రిప్ట్ ని ఆమె ఒక ఇండస్ట్రీ హిట్ గా ఊహించుకోగా పులి సినిమా అట్టర్ డిసాస్టర్ గా నిలిచి ఆమెకి షాక్ ఇచ్చింది. అంతటితో ఆగితే ఏమో అనుకోవచ్చు కానీ ఆమె నిర్మాతలు ఆ సినిమాకి సంబంధించి ఆమెకి యాభై లక్షలు పైగా ఇవ్వవలసి ఉంది. ఈ విషయం ఇదివరకే మనం ప్రకటించాం కాగా దీనికి సంబంధించి ఆమె నిర్మాతల మండలి లో కంప్లైంట్ ఇవ్వడం తో మళ్ళీ హాట్ హాట్ గా మారింది ఈ సంగతి. శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు పింగా తమిళ నిర్మాతలు ఇచ్చిన వివరణ చూసిన తరవాత శ్రీదేవి మైండ్ బ్లాక్ అయ్యిందట.

రెండున్నర కోట్ల రెమ్యునరేషన్ లు ముప్పై లక్షలు టాక్స్ రూపం లో ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది అని రిలీజ్ కు దగ్గరవుతున్న టైంలో ఇతర భాషల్లో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలంటే అదనంగా ముట్టచెప్పాలని శ్రీదేవి ఆమె భర్త బోనీకపూర్  కండిషన్ పెట్టారట. ఈ మూవీలో చేసిన ఏ ఇతర నటులకు డబ్బింగ్ వెర్షన్ కోసం అదనంగా చెల్లింపులు చేయకపోయినా.. శ్రీదేవికి మాత్రం తెలుగు వెర్షన్ కోసంం 15 లక్షలు హిందీ డబ్బింగ్ వెర్షన్ శాటిలైట్ రైట్స్ లో 20శాతం.. మొత్తం కలిపి 55 లక్షలు కట్టారట శ్రీదేవికి.

తన కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మాత్రమే ఉండాలి అని చెప్పిన ఆమె ఆయనకి ఒక యాభై లక్షలు ఇప్పించింది అని, మార్కెటింగ్ డిజైనర్ కి ఎనిమిది లక్షలు సహా చాలా వదిలించింది అని వారు వాదిస్తున్నారు. హిందీ వెర్షన్ కోసం చాలా ఖర్చు పెట్టినా ఆమె మొఖం చూసి రూపాయి రాలేదు అని వారు వాపోతున్నారు. పులి నిర్మాతలు సెల్వ కుమార్, సిబు తమీన్స్ ఆమె మాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అని షాక్ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -