Monday, May 6, 2024
- Advertisement -

నేను కొడితే ఐశ్వ‌ర్య రాయ్ బతికి ఉండేది కాదేమో – స‌ల్మాన్

- Advertisement -

బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు స‌ల్మాన్ ఖాన్‌,ఐశ్వ‌ర్య రాయ్ ఇద్ద‌రు ప్రేమించుకున్న సంగ‌తి తెలిసిందే.స‌ల్మాన్ వ్య‌వ‌హారం తేడాగా ఉండ‌టంతో అత‌ను నుంచి విడిపోయింది ఐశ్వ‌ర్య‌.త‌రువాత కాలంలో ఐశ్వ‌ర్య రాయ్ అభిషేక్ బ‌చ్చ‌న్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరిద్ద‌రి ఓ ఆరాద్య అనే పాప కూడా ఉంది.ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఎందుకు అనే క‌దా మీ డౌట్.ఏం లేదండీ మాజీ ప్రేయ‌సీ ఐశ్వ‌ర్య రాయ్‌పై కామెంట్స్ చేశాడు స‌ల్లూ భాయ్‌.ప్ర‌స్తుతం బాలీవుడ్ మొత్తం లైంగిక వేధింపులు చూట్టునే తిరుగుతుంది.బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీదత్తా ప్రముక నటుడు నానా పటేకర్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి చెందిన ఓ పాత వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.ఆ వీడియోలో ఐశ్వర్య,సల్మాన్ ఇద్ద‌రు క‌లిసి ఉన్నారు.

సల్మాన్ తనను కొట్టాడంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య. దీనిపై స్పందించిన సల్మాన్ ఖాన్ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఓ జర్నలిస్ట్ మీరు ఎప్పుడైనా.. మహిళపై చేయి చేసుకున్నారా..? అంటూ ఐశ్వర్య కూడా పరోక్షంగా సల్మాన్ న్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సల్మాన్.. ఆ మహిళ నేను కొట్టానని చెబుతోంది.. గతంలో ఓ జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడిగితే నేను టేబుల్ విరగ్గోట్టాను. అతను షాక్ అయిపోయాడు. నేను కోపంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా కొడతాను. బహుసా అంత గట్టిగా కొట్టి ఉంటే ఆమె బతికి ఉండేది కాదేమో అంటూ వెల్లడించాడు.ఇంత కోపం ఉండ‌టం వ‌ల్లే ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని నెటిజ‌న్లు స‌ల్మాన్‌ని ట్రోల్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -