Thursday, May 9, 2024
- Advertisement -

ప‌డి ప‌డి లేచే మ‌న‌సు టీజ‌ర్‌

- Advertisement -

శర్వానంద్- సాయి పల్లవి హీరో,హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం ప‌డి ప‌డి లేచే మ‌న‌స్సు.హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ రోజు విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఓ అమ్మాయి వెంట ప‌డే కుర్రాడి పాత్ర‌లో క‌నిపించాడు శర్వా.సాయి పల్లవి డాక్ట‌ర్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థం అవుతుంది.హోట‌ల్లో కాఫీ తాగుతున్న శ‌ర్వాని సాయి పల్లవి ఏంటీ ఫాలో చేస్తున్నావా అంటు వార్నింగ్ ఇవ్వ‌డం మ‌నం ఈ టీజ‌ర్‌లో చూడ‌వ‌చ్చు.

అయిన మీరు ఇలా దగ్గ‌రికి వ‌చ్చి మాట్లాడ‌టం ఏం బాలేదండీ,నాపాటికి నేను అర‌కిలోమీట‌రు నుంచి ప్రేమించి బ‌తికుస్తున్నాను అంటూ శ‌ర్వానంద్ చెప్పే డైలాగులు టీజ‌ర్‌కు హైలెట్‌గా నిలిచాయి.మంచి ప్రేమ‌క‌థ‌కు తోడుగా టీజ‌ర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకునే విధాంగా ఉంది.ల‌వ్‌లోని మ్యాజిక్ మ‌రోసారి మ‌న ముందుకు తీసుకువ‌స్తున్నాడు హను రాఘవపూడి.ఎస్.ఎల్.వి.సి సినిమాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. డిసెంబర్ 21న సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -