Friday, May 17, 2024
- Advertisement -

తొలి హీరోతో స‌మంత మ‌ళ్లోసారి

- Advertisement -
  • యూట‌ర్న్ తీసుకుంటున్న అక్కినేని కోడ‌లు

తెలుగులో తొలి సినిమాలో న‌టించిన న‌టుడితోనే వివాహం చేసుకున్న న‌టి స‌మంత అక్కినేని. మొద‌టి సినిమాతోనే ఇద్ద‌రు ఒక్క‌టై ఇప్పుడు అక్కినేని ఇంట మెట్టింది. పెళ్ల‌యి దాదాపు నాలుగు నెల‌ల‌వుతోంది. కానీ చైతూ, స‌మంత జంట మాత్రం పెళ్లి జీవితాన్ని ఇంకా ప్రారంభించ‌లేదు. వారిద్ద‌రూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. నాగ చైత‌న్య దాదాపు మూడు సినిమాలు చేతిలో పెట్టుకున్నాడు. స‌మంత కూడా రెండు, మూడు సినిమాలు లైన్‌లో పెట్టింది.

ప్ర‌స్తుతం స‌మంత రామ్‌చరణ్‌తో నటించిన రంగస్థలం.. విశాల్‌తో నటించిన అభిమన్యుడు విడుద‌ల కావాలి. అయితే తొలిసారి వెండితెర‌పై మెరిసిన హీరోతో మ‌ళ్లీ స‌మంత జ‌త క‌ట్ట‌బోతుందంట‌. సమంత తొలి సినిమా `మాస్కోవిన్ కావేరి`, త‌మిళంలో వ‌చ్చింది. హీరో రాహుల్ రవీంద్రన్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించింది. అయితే వీళ్లిద్దరూ కలిసి నటించిన ఆ తమిళ సినిమా ఆల‌స్యంగా విడుద‌ల‌య్యింది. పైగా ప‌రాజ‌యం పొంద‌డంతో ఎవ‌రికీ తెలియ‌దు.

ఇప్పుడు ఏళ్ల త‌ర్వాత రాహుల్ రవీంద్రన్‌తో మ‌ళ్లీ సమంత న‌టించ‌డానికి అంగీక‌రించిందంట‌. యూ ట‌ర్న్ అనే కన్నడ సినిమా రీమేక్‌లో రాహూల్‌తో పాటు స‌మంత నటించడానికి ఒప్పుకున్నార‌ట‌. ఈ సినిమా తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తీయనున్నారు. కన్నడ వెర్షన్ తీసిన పవన్‌కుమార్ ఈ సినిమాను ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నారు.రాహుల్ రవీంద్రన్ – సమంత మొదటి నుంచి ఫ్రెండ్స్. సమంతకు మొదటి నుంచి తెలుగు సినిమాలకు డబ్బింగ్ చెబుతూ వస్తున్న‌సింగర్ చిన్మయి భర్త ర‌వీంద్ర‌న్‌. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రూ క‌ల‌వ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -