Thursday, May 9, 2024
- Advertisement -

అబ్బ‌…! చ‌చ్చిపోతున్నానంటూ రామ‌ల‌క్ష్మి

- Advertisement -

ఇటివల అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంతా ఇటు వైవాహిక జీవితంలో అటు సినిమా జీవితంలో విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ క్రమంలో సమ్మూ హీరోయిన్ గా ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వచ్చిన మూవీ రంగస్థలం.

ఈ స‌నిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా.. పొడవాటి జుట్టుకు రిబ్బను కట్టుకుని.. రంగస్థలం సినిమాలో సమంతా చేసిన యాక్టింగ్‌ ప్రేక్షకులకు మంత్రముగ్థుల్ని చేసేసింది. రామలక్ష్మి పాత్రతో సమంతా ప్రతి ఒక్కరి హృదయాలను ఆకట్టుకుంది. ఇక రంగమ్మ.. మంగమ్మ.. పాటలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట మీద సూప్స్ కూడా వస్తున్నాయి.

ఓ చిన్నారి చక్కగా లంగా ఓణీ వేసుకుని, పెద్ద జుట్టుతో, ముద్దు ముద్దు హావభావాలతో ‘రంగమ్మ మంగమ్మ’ పాటకు స్టెపులు వేసింది. అచ్చం సమంతలాగే వయ్యారంగా చేతులు తిప్పుతూ ఈ చిట్టి రామలక్ష్మి వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియోను షేర్ చేస్తూ సమంతా ఈ చిట్టి రామలక్ష్మీకి ఫిదా అయి హర్ట్‌ సింబల్స్‌తో రిప్లై ఇస్తూ చిన్నారి వేసిన స్టెప్పులకు చచ్చిపోతున్న అంటూ ట్వీట్ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -