Wednesday, April 24, 2024
- Advertisement -

నాగ చైతన్య మంచి తండ్రి అవుతాడు అంటున్న సమంత

- Advertisement -

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత అక్కినేని పెళ్లి జరిగిన కొన్ని రోజుల నుంచే ఆమె ప్రెగ్నెన్సీ గురించి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. ఇప్పటిదాకా చాలా సార్లు ఆమె ఈ పుకార్లను కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ పై మాట్లాడుతూ నాగచైతన్య గురించి చెప్పుకొచ్చింది సామ్. నాగచైతన్య ఒక మంచి హస్బెండ్ కాబట్టి తను ఖచ్చితంగా ఒక మంచి తండ్రి కూడా అవుతాడని తనకు నమ్మకం ఉందని చెప్పింది సమంత.

గతంలో ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడిన సమంత ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయితే సినిమాలకు గుడ్ బై చెప్పేసి తన పిల్లలని జాగ్రత్తగా చూసుకుంటానని, తనకి అప్పుడు పిల్లలే తనకి తన లోకం అయిపోతారని సమంత చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు ఒక నటుడిగా నాగచైతన్య గ్రోత్ గురించి గురించి మాట్లాడుతూ “చై చాలా ఫోకస్డ్ మరియు రెస్పాన్సిబుల్ గా ఉంటాడు అని చెప్పుకొచ్చింది సమంత. ఇక సినిమాల పరంగా సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమా జులై 10న విడుదల కాబోతోంది. మరివైవు నాగచైతన్య ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -