Monday, April 29, 2024
- Advertisement -

అడిగి పొగిడించుకుంటున్న సమంత?

- Advertisement -

ఓ బేబీ సినిమా అందించిన విజయం తో సమంత సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ సినిమా కి దర్శకత్వం వహించిన నందిని రెడ్డి కూడా చాలా రోజుల తర్వాత హిట్ కొట్టిన సంతోషం లో ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి మళ్ళీ పని చేయాలనే ఆలోచన లో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే మీడియా లో చాలా మంది సమంత ని లేడీ సూపర్ స్టార్ అని పొగిడేస్తున్నారు. సడన్ గా సమంత కి సూపర్ స్టార్ ఇమేజ్ ఎలా వచ్చింది అనే విషయం అంతు చిక్కడం లేదు. కాకపోతే ఇక్కడే ఉంది ట్రిక్కు.

సమంత చాలా మంది కి ఇంటర్వూస్ ఇస్తుంది. చాలా మంది మీడియా వాళ్ళ తో ముచ్చటిస్తుంది. ఈ ఇంటర్వూస్ లో సమంత ని సూపర్ స్టార్ అని పిలవాలి అని, సూపర్ స్టార్ అని సంబోధిస్తూ, దానికి సంబంధించి అని ఆమె పీఆర్ టీమ్ నుంచి సంకేతాలు వెళ్తున్నాయట. అందుకే సడన్ గా ఒక వర్గం మీడియా సమంత ని సూపర్ స్టార్ అని పొగుడుతుంది.

నిజానికి అనుష్క కి తప్ప సూపర్ స్టార్ అని పిలిపించుకొని అర్హత తెలుగు లో ఇంకో హీరోయిన్ కి లేదు. అనుష్క మొదటి నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వచ్చింది. తన పేరు మీద సినిమాలు థియేటర్ దగ్గర ఆడాయి, రికార్డులు సృష్టించాయి. సమంత తన కెరీర్ లో పెద్దగా అచీవ్ చేసింది ఏమి లేదు. తన కెరీర్ కూడా మారే సక్సెసఫుల్ హీరోయిన్ మాదిరిగానే సాగింది కాబట్టి సమంత సూపర్ స్టార్ ఏంటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -