Friday, May 3, 2024
- Advertisement -

సందీప్ రెడ్డి కి పరోక్షం గా కౌంటర్ ఇచ్చిన తెలుగు దర్శకుడు?

- Advertisement -

మోహన్ కృష్ణ ఇంద్రగంటి చేసినవి తక్కువ సినిమాలే కానీ పెద్దగా కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాలు ఏమి లేవు. అయితే ఈ దర్శకుడి తన కథలని హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాల నుండి కాపీ కొడతాడని కంప్లైంట్ చాలా మందికి ఉంది. ఈ రోజు అయన ట్విట్టర్ లో చేసిన కొన్ని కామెంట్స్ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి మీద జరుగుతున్న ఇష్యూ మీద అని అర్ధం అవుతుంది. కానీ ఆయన సందర్భం మెన్షన్ చేయకుండా తెలివిగా తను చెప్పాలనుకున్నది చెప్పి మౌనం గా ఉండిపోయారు.

“కళలు అన్నిటిలో సినిమా అనే మాధ్యమం చాలా విచిత్రమైనది. సమాజం యొక్క పరిపక్వత ని మాత్రమే కాకుండా సమాజం లో ని వెనుకబడినతనాన్ని కూడా సినిమా వేలెత్తి చూపించగలదు. నిజానికి చాలా పెద్ద విజయాలు సాధించిన సినిమాలు సమాజం యొక్క వెనుకబడినతనాన్ని చూపిస్తున్నాయి కానీ పరిపక్వత ని కాదు. సినిమా విచిత్రం గా దానికి మాత్రమే ఉపయోగపడుతుంది.” అని ఆయన కామెంట్స్ చేసారు.

అయితే ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ పరోక్షంగా ప్రస్తుతం కబీర్ సింగ్, ఆ సినిమా డైరెక్టర్ సందీప్ చేసిన కామెంట్స్ గురించి అనే విషయం అర్ధం అవుతుంది.

ప్రస్తుతానికి ఈ దర్శకుడు నాని, సుధీర్ బాబు తో వీ అనే సినిమా ని చేస్తున్నారు. నివేత థామస్, అదితి రావ్ హైదరి ఈ సినిమా లో నటీ నటులు గా కనిపించనున్నారు.

https://twitter.com/mokris_1772/status/1148786305565724672

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -