అక్కినేని ఇంటి కొడలు వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. పెళ్లి తరువాత సమంత నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో ఈ బామకు మరింత డిమాండ్ పెరిగింది. పెళ్లి తరువాత భర్త నాగచైతన్యతో కలిసి మొదటిసారి మజ్ను సినిమాలో కనిపించనుంది. ఈ సినిమాలో చైతన్య భార్యగానే నటించింది సమంత. ఈ సినిమాతో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో బేబీ అనే సినిమాలో కూడా నటిస్తోంది.
తాజాగా ఈ సినిమాలో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఇందులోని ఓ ఫోటోలో సమంత స్కూటర్ నడుపుతు కనిపించి తెగ హల్ చల్ చేసింది.చలాకీగా బజాజ్ స్కూటర్ లాంటిది వేసుకుని రయ్యిమని దూసుకుపోతూ ఉంటే వెనుక పిల్లలు యూత్ కేరింతలు కొడుతూ ఫాలో కావడం చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మి హీరో నాగ శౌర్య కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఓ కొరియన్ మూవీ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సమంతా లక్ష్మిల పాత్రలు షాక్ ఇచ్చే రీతిలో ఉంటాయట. నందిని రెడ్డితో గతంలో జబర్దస్త్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.మరి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో మూవీ అయిన వీరికి హిట్‌ను అందిస్తుందేమో చూడాలి.
- Advertisement -
స్కూటర్ మీద చక్కర్లు కొడుతున్న సమంత
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -