Wednesday, May 15, 2024
- Advertisement -

లైంగిక వేధింపులపై కామెంట్స్ చేసిన స‌మంత‌

- Advertisement -

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కు ప్ర‌తి చోట స్త్రీలపై లైంగిక వేధింపులు జ‌రుగుతునే ఉన్నాయి.మొన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్‌ను షేక్ చేసిన కాస్టింగ్ కౌచ్‌ ఇప్పుడు బాలీవుడ్ మొత్త‌ని వ‌ణికిస్తుంది.బాలీవుడ్ హీరోయిన్ త‌ను శ్రీ ద‌త్తా ,నానా ప‌టేక‌ర్‌పై లైంగిక వేధింపులు ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌లంగా మారింది.దీంతో చాలామంది ఇండ‌స్ట్రీలో త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల‌ను మీటూ అనే క్యాప్ష‌న్ ద్వారా తెలియ‌జేస్తున్నారు.తాజాగా ఈ లైంగిక వేధింపులు గురించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ,అక్కినేని ఇంటి కోడ‌లు స‌మంత స్పందించారు.

”#మీటూ మూమెంట్ లో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడడానికి చాలా మంది మహిళలు ధైర్యంగా ముందుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ ధైర్యం కొనియాడదగినది.ఇండ‌స్ట్రీలో అంద‌రు ఒకేలా ఉండ‌ర‌ని,మంచివారు కూడా ఉన్నారు.అంద‌రిని అనుమానిస్తూ అవమానించ‌డం త‌ప్ప‌ని చెప్పుకొచ్చింది.ఇప్పుడు మీరు చేస్తున్న మీటూ ఉద్య‌మం భావిత‌రాల‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని ,అందుకే నేను మీటు మూమెంట్‌కి మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నాన‌ని వెల్ల‌డించింది స‌మంత‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -