Saturday, May 18, 2024
- Advertisement -

స‌మంత ఫ్యాన్‌ను చిత‌క్కొట్టిన పోలీసులు

- Advertisement -

ఏమాయ చేశావె సినిమాతో త‌న అందాలు.. న‌ట‌న.. క్యూట్ వాయిస్‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న స‌మంత ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంద‌రి హీరోల‌తో జ‌త‌క‌ట్టి గ్లామ‌ర్‌.. న‌ట‌న‌కు పెద్ద‌పీట వేస్తూ సినిమాలు చేస్తూ టాలీవుడ్ బిజీగా ఉన్న హీరోయిన్‌గా మారింది.

అయితే ఆ త‌ర్వాత తొలి సినిమాలో న‌టించిన హీరోతోనే ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకొని ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గ‌డుపుతోంది. అక్కినేని ఇంటికి మెట్టిల్లుగా మార్చుకొని ఇప్పుడు మామ అక్కినేని నాగార్జున‌, భ‌ర్త అక్కినేని నాగ‌చైత‌న్య‌తో సినిమాలు చేస్తోంది. ఈమెకు టాలీవుడే కాకుండా త‌మిళ్‌లో కూడా అభిమానులు బీభ‌త్సంగా ఉన్నారు. ఆమె ఎక్క‌డికెళ్లినా అభిమానులు పోటెత్తుతున్నారు. ఆమెతో ఆటోగ్రాఫ్‌.. ఫొటోగ్రాఫ్ తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ ప్ర‌య‌త్న‌మే ఓ అభిమానికి తీవ్ర క‌ష్టాలు తెచ్చిపెట్టింది.

అనంతపురం జిల్లాలో సోమవారం ఓ మొబైల్‌ షోరూం ప్రారంభించ‌డానికి న‌టి సమంత వెళ్లింది. అనంత‌పురంలోని సుభాశ్ రోడ్డులో హ్యాపీ మొబైల్ షోరూంను ఆమె ప్రారంభించి బ‌య‌ట‌కు వ‌చ్చింది ఈ స‌మ‌యంలో ఓ అభిమాని స‌మంతను చూడాలనే ఆశ‌తో వేగంగా వ‌చ్చాడు. అత‌డు వ‌స్తున్న విష‌యాన్ని గమనించిన పోలీసులు అతడిని ఆపారు. వెళ్ల‌వ‌ద్ద‌ని చెప్ప‌గా ఆ యువ‌కుడు వారిపై దాడి చేశాడు. వెంట‌నే పోలీసులు ఆ యువ‌కుడిని చితకబాదారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ తీవ్ర తోపులాట జ‌రిగింది. పోలీసులు లాఠీచార్జి చేసేంత స్థాయికి చేరింది.ఈ ఘటనతో బాధ‌కు గురైన సమంత వెంట‌నే అక్క‌డి నుంచి తిరుగుముఖం ప‌ట్టింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -