నాగచైతన్య,సమంత కలిసి నటిస్తున్న సినిమా మజిలి. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో చైతన్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు, ఒకటి క్రికెటర్‌గా , రెండో ప్రేమ విఫలమై ఇష్టం లేని పెళ్లి చేసుకున్న వ్యక్తిగా కనిపించాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తైన సందర్భంగా చిత్ర యూనిట్ తీసుకున్న ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది సమంత.
మజిలి సినిమాను నా జీవితంలో మరిచిపోలేనని చెప్పుకొచ్చింది. ఇంత మంచి టీమ్ తో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ .. సినిమా టీమ్ తో దిగిన ఫొటోను షేర్ చేసింది. పెళ్లి తరువాత సమంత నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా కావవంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది సమంత. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -
‘మజిలి’ చివరి పిక్ అదిరిందిగా…!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -